- ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు : జిల్లాలో జాతీయస్థాయి క్రీడాపోటీల నిర్వహణకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సొన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో 11వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్2025–-26 నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై హ్యాండ్ బాల్ ఫైనల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపై ఉందని, క్రీడాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.
అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రశాంతి, మండల సీనియర్ నాయకుడు సరికెల గంగన్న, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, నాయకులు జమాల్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
