నిర్మల్ పట్టణ అభివృద్ధికి రూ.57 కోట్లు : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ పట్టణ అభివృద్ధికి రూ.57 కోట్లు : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.57 కోట్లు మంజూరు చేసిందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, పలు మౌలిక సదుపాయాల కల్పనకు వాటిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. దసరా ఉత్సవాల అనంతరం పనులు వేగవంతం అవుతాయని చెప్పారు.  

పాపేశ్వరాలయంలో పూజలు

 నర్సాపూర్(జి), వెలుగు: దిలావల్ పూర్ మండలం కదిలే గ్రామంలోని పాపేశ్వరాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా పంచాక్షరి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు. బీజేపీ మండల అధ్యక్షుడు అయిండ్ల నర్సారెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నార్వాడే ప్రవీణ్ పటేల్ తదితరులున్నారు.