ట్రిపుల్ ఐటీ కల నిజం చేసేందుకే ఉచిత శిక్షణ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ట్రిపుల్ ఐటీ కల నిజం చేసేందుకే ఉచిత శిక్షణ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  •     ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ అర్బన్ , వెలుగు : ట్రిపుల్​ఐటీ కల నిజం చేసేందుకే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా నెల రోజులపాటు రెసిడెన్షియల్ విధానంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగరంలోని బోయపల్లిలో ఉన్న వైటీసీ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన మార్గనిర్దేశం, శిక్షణ లేకపోవడం వల్లే వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎంపికైన విద్యార్థులకు ఈనెల 27 నుంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ట్రిపుల్​ఐటీ ప్రవేశానికి లోతైన శిక్షణ అందించనున్నట్లు వివరించారు. అంతకుముందు మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ నగరంలో క్లాక్ టవర్ వద్ద ఎస్​డీఎఫ్- ముడా నిధులతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఎస్పీ జానకితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, పాల్గొన్నారు.