
మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు రేషన్‌కార్డులు ఇవ్వకుండా పేదల కడుపులు మాడ్చిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రూరల్ మండలం తువ్వగడ్డతండా, ఫతేపూర్‌లో కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ప్రారంభించడంతో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ కింద చేపట్టిన సీసీరోడ్లకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రయారిటీ ఇస్తోందన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, బుద్దారం సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.
సేవాభావంతో వైద్యం అందించాలి
పాలమూరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవాభావంతో వైద్యం అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన రంగయ్య శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు బెజ్జుగం రాఘవేందర్ పాల్గొన్నారు.
రాజా బహదూర్ ఆశయాలు కొనసాగిస్తాం
రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 156 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి వసతులు లేని సమయంలో హైదరాబాద్ లో హాస్టల్ నిర్మించారని గుర్తు చేశారు.
మహిళలు చదువుకోవాలనే సంకల్పంతో వందేండ్ల కిందటే రెడ్డి మహిళా కాలేజీ ఏర్పాటు చేశారని చెప్పారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు తూము ఇంద్రసేనారెడ్డి, వేపూరి రాజేందర్ రెడ్డి, మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.