రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  •  కేంద్రమంత్రి గడ్కరీని కోరిన ఎమ్మెల్యేలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో అనేక మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. 

జిల్లాలోని రోడ్ల సమస్యలను వివరించేందుకు ప్రత్యేకంగా నితిన్ గడ్కరీని కలిసేందుకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి మహారాష్ట్రలోని నాగ్ పూర్ వెళ్లారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో అనేక గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదని.. దీంతో అభివృద్ధి కుంటుపడిపోతోదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

మారుమూల గ్రామాలకు సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ సమస్య రోడ్ల అభివృద్ధికి ఆటంకంగా మారుతోందన్నారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. కాగా తమ వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు.