ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

 ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందుకున్న అంబర్ పేటకు చెందిన లాయర్ పోగులకొండ  ప్రతాప్ గౌడ్ తో పాటు.. నందకుమార్ భార్య చిత్రలేఖ విచారణ కోసం సిట్ ఎదుట హాజరయ్యారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తొలిత ప్రతాప్ గౌడ్ రాగా.. కాసేపటికి నందకుమార్ భార్య చిత్రలేఖ వచ్చారు. ఫాం హౌస్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నందకుమార్ ఆర్థిక లావాదేవీలపై ఆయన భార్య చిత్రలేఖను ప్రశ్నించే అవకాశముంది.

ఇదిలా ఉంటే సిట్ నోటీసులను సవాల్ చేస్తూ అడ్వొకేట్ ప్రతాప్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే తదుపరి ఆదేశాల వరకు ప్రతాప్ గౌడ్ ను అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది.