వారిని గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే 

వారిని గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే 

 

సికింద్రాబాద్‍, మల్కాజిగిరి ఎంపీ క్యాండిడేట్ గెలుపు బాధ్యతను అన్ని ప్రధాన పార్టీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థుల భుజాన వేశాయి. రెండు లోక్ సభ స్థానాల్లో ని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాం పల్లి, ఎల్బీనగర్‍ మినహా ఉన్న 12 మంది టీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేలే. ఇప్పటికే పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని టీఆర్‍ఎస్‍ అధిష్ఠానం ఎమ్మెల్యేలకు సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ రావాలని టార్గెట్లు పెట్టింది. బీజేపీ, కాంగ్రెస్ కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కోసం పనిచేయాలని కోరాయి. – హైదరాబాద్, వెలుగు

సికింద్రాబాద్​లో ఎమ్మెల్యేలకు సవాలు

లోక్ సభ ఎన్నికలు సికింద్రాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలకు సవాల్ గా మారాయి.అన్ని ప్రధాన పార్టీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాయి. దీంతో 3 నెలల క్రితం ఓట్ల కోసం తిరిగిన వారే మళ్లీ ప్రజాక్షేత్రంలో రంగంలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు  ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రధానంగా టీఆర్ఎస్ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ రావాలని టార్గెట్లు పెట్టింది. ఇటీవల జరిగిన సన్నాహక సభలో ఎమ్మెల్యేలంతా పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని  హామీ ఇచ్చారు. నామినేషన్ నాటి నుంచి ఎంపీ అభ్యర్థి గెలిచే వరకు ప్రచారం పర్వంలో ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ కోరింది. పార్టీ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాదు బీజేపీ, కాంగ్రెస్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఎంపీగా పోటీచేసే అభ్యర్థి కోసం పనిచేయాలని కోరాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అంబర్ టఅభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్, అంబర్పేట, ముషీరాబాద్ ల నుంచి బీజేపీ అభ్యర్థులే గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖైరతాబాద్ లో రెండో స్థా నం,ముషీరాబాద్ లో మూడో స్థా నంలో నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్ లకు ఆయా నియోజకవర్గాల్లోమంచి పట్టు ఉంది. దీంతో కిషన్ రెడ్డి విజయం కోసం ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థు లను ఆపార్టీ రంగంలోకి దింపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్  ఎమ్మెల్యే అభ్యర్థు లను కలుపుకొని పోతున్నారు. ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులంతా ఓట్లు రాబట్టారు. ఇక్కడ కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంకు ఉంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణు వర్ధన్ రెడ్డి 52వేలకు పైగా ఓట్లు సాధించారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థు లు ఇప్పుడు తమ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం కష్టపడుతున్నారు. సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, లష్కర్ లో మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక టీఆర్ఎస్ ఉన్న 7 నియోజకవ-ర్గాల్లో 6 స్థా నాల్లో తమ పార్టీ అభ్యర్థు లు గెలవటంతో ఈసారి సికింద్రాబాద్ స్థా నం తమదేనని ధీమాగా ఉంది.

మల్కాజిగిరిలో డిసైడ్ చేసేది వాళ్లే..

మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. స్థానిక ఎమ్మెల్యేలే గెలుపోటములను నిర్ణయించే స్థాయికి చేరారు.మల్కాజిగిరి లోక్ సభ సెగ్మెం ట్ లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 5 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో, ఒకటి రంగారె డ్డి, ఇంకొకటి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఎంపీ అభ్యర్థు లు, పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్  నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీడీపీ నుంచి తోటకూర జంగయ్య, కాంగ్రెస్ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ ఈ స్థా నాన్ని 70 వేల ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుంది. 2018లోనూ అదే పార్టీనుంచి మల్లారె డ్డి బరిలో నిలిచి గెలిచారు. దీంతో ఇక్కడ టీఆర్‍ఎస్ కు బలమైన క్యా డర్‍ ఉంది. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా 2018లో గెలిచిన మైనంపల్లి హన్మంతరావు 2014 కంటే ముందు నుంచే  టీడీపీ నేతగా నియోజకవర్గంలో సుపరిచితుడు. కుత్బుల్లాపూర్  సెగ్మెంట్ లో 2014లోటీడీపీ తరఫున గెలిచిన కేపీ వివేకానంద తర్వా త గులాబీ గూటికి చేరారు. 2018లోనూ గెలిచి 27 శాతం ఓట్లను పెంచుకున్నారు. 2014లో కూకట్ పల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసినమాధవరం కృష్ణారావు  40వేల మెజారిటీతోగెలిచాడు. ఆ తర్వా త టీఆర్ఎస్ లో చేరారు.ఆయనకున్న వర్గం , టీఆర్‍ఎస్‍ క్యా డర్ అంతా2018లోనూ మాధవరం కృష్ణారావు గెలుపుకోసం పనిచేసింది. టీడీపీ నుంచి తొలిసారి పోటీచేసిన నందమూరి సుహాసినిపై 50 వేల ఓట్లతోగెలిచారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానంలోని కీలకమైన ఈ మూడు నియోజకవర్గాలలో ఆధిక్యం సాధించిన పార్టీ  అభ్యర్థి కచ్చితంగా ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుం దని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలన్నీ ఈ మూడు నియోజకవర్గాలపై దృష్టి పెట్టగా , స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం ఈ సెగ్మెం ట్ లోని అన్ని అసెంబ్లీ స్థా నాలు అధికారపార్టీవే.  2016లో జరిగిన మున్సిపల్, గ్రేటర్ఎన్నికలలోనూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్య-ర్థులే గెలిచారు. ఎంపీ ఎన్నికలలోనూ అభ్యర్థులగెలుపోటములపై ఇవే అంశాలు ప్రభావం చూపేఅవకాశం ఉండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఎంపీ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధారపడి ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి బరిలోఉన్న రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచంద-ర్ రావులు స్థా నికంగా ఉన్న మాజీలు, పోటీచేసిఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులను వెంటేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.