కొత్త పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు

కొత్త పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు

భిక్కనూరు, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నది టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మాత్రమేనని విప్‌‌‌‌‌‌‌‌ గంప గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. భిక్కనూరుతో పాటు రామేశ్వరపల్లి, బస్వాపూర్ గ్రామల్లో మంగళవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కొత్త పింఛన్లను పంపిణీ చేశారు. కామారెడ్డి డివిజన్​ పరిధిలో పాతవి, కొత్తవి కలిపి 64,370 పింఛన్లు ఉన్నయన్నారు. వీరికి నెలకు దాదాపు రూ.13.55  కోట్లలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీనివాస రావు, సర్పంచులు తునికి వేణు, నాగర్తి పోతిరెడ్డి, మంజుల, ఎంపీపీ గాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీ పద్మ నాగభూషణంగౌడ్​పాల్గొన్నారు. 

మాక్లూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి...

మాక్లూర్ : మాక్లూర్ మండలానికి కొత్తగా మంజూరై 1,601ఆసరా పెన్షన్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమం ధేయ్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. జడ్పీ చైర్మన్ విఠల్‌‌‌‌‌‌‌‌రావు, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్, ఎండీవో క్రాంతి, ఎంపీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. 

పిట్లంలో షిండే...

పిట్లం: మద్నూర్‌‌‌‌‌‌‌‌ మండలానికి కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లను ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్‌‌‌‌‌‌‌‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఏదో ఓ రూపంలో సాయం చేస్తున్న ఏకైక సర్కారు తమదేనని చెప్పారు. జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఎంపీపీ లక్ష్మీ బాయి, జడ్పీటీసీ అనిత 
తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయిలో జాజుల...

తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే జాజుల సురేందర్ చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. తమ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఎంపీపీ కౌడి రవి, జడ్పీటీసీ రమాదేవి, వైస్ ఎంపీపీ నర్సింలు, సీడీసీ చైర్మన్ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్ మండల సంజీవులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవి పాల్గొన్నారు