
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరించారు. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, ఆ తరువాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సభకు 109 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక అన్ని పార్టీల తరఫున కలుపుకుని తొలిసారి అసెంబ్లీలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు.
ప్రమాణస్వీకారాల తరువాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. కాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్ చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు.