ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ కు టీఆర్ఎస్ నేతల బుజ్జగింపు

ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ కు టీఆర్ఎస్ నేతల బుజ్జగింపు

వరంగల్ లో ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ నివాసంలో టీఆర్ఎస్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఆయన నివాసంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఎస్ఆర్డీ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ప్రదీప్ రావును కలిశారు. సీఎం సూచన మేరకే ప్రదీప్ రావ్ కు నచ్చచెప్పడం కోసం వచ్చామని బస్వరాజు సారయ్య తెలిపారు.

పార్టీలో ప్రదీప్ రావుకు అన్యాయం జరిగిన విషయం నిజమే, పార్టీకి నమ్మదగిన వ్యక్తి అని అన్నారు. అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రదీప్ రావుకు నచ్చజెప్పేందుకు వచ్చామని పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యకర్తల అభిష్టం మేరకు నా నిర్ణయం ఉంటుందని ప్రదీప్ రావ్ తేల్చి చెప్పారు.