న్యూఢిల్లీ: ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) 2027లో భారత జీడీపీ వృద్ధి 6.9 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. జీఎస్టీ, ఆదాయపు పన్ను తగ్గింపులు, వివిధ దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున3.8 శాతంగా ఉండవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని అంచనా . రూపాయి విలువ డాలరుతో పోలిస్తే సగటున 92.26 వద్ద ఉండవచ్చని, కేంద్ర ప్రభుత్వ అప్పులు జీడీపీలో 55.5 శాతానికి తగ్గుతాయని ఇండ్రా వివరించింది.
