
- కేటీఆర్, హరీశ్‌పై ఎమ్మెల్సీ అద్దంకి ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని తట్టుకునే శక్తి కేసీఆర్ వల్లే కాలేదని, అందుకే ఆయన ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, అలాంటిది మీతో ఏమవుతోందని కేటీఆర్, హరీశ్ రావును కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. రేవంత్ స్థాయిని ఎంత తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా.. ఆయన అంతకంతకు పైకి ఎదగడం తప్ప.. కిందికి చూసేది ఉండదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను కాపాడే శక్తులు, బీఆర్‌ఎస్‌ను బతికించే నేతలు లేరన్నారు.