MLC ఎన్నికలు బహిష్కరించిన కాంగ్రెస్

MLC ఎన్నికలు బహిష్కరించిన కాంగ్రెస్

కాంగ్రెస్‌ పార్టీ MLC ఎన్నికలను బహిష్కరించింది. సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. రేపు(మంగళవారం) ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక జరుగనున్నది. ఐదు ఖాళీలకు TRS, MIM తరఫున ఐదుగురు నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌ పార్టీ మారడంతో కాంగ్రెస్‌కు తగిన సంఖ్యాబలం లేకుండా పోయింది. స్టేట్స్‌మన్‌గా ఉండాల్సిన  సీఎం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని  TPCC చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్  చర్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులను  ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు ఉత్తమ్.