ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ సర్కారు 

ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ సర్కారు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కార్మిక సంఘాల ఐక్యతను అభినందించారు. గతంలో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ చేస్తే.. ప్రస్తుతం మోడీ సర్కారు వాటిని మళ్లీ ప్రైవేటుపరం చేస్తోందని మండిపడ్డారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానన్న మోడీ ఇప్పుటి వరకు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

పేద ప్రజల భూముల్ని ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం మూడు లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో 30వేల మరమగ్గాలు ఆగిపోయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం..

బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ

ఎయిర్‌పోర్టులో కరెంట్ పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్