కేటీఆర్..ఎంపీగా పోటీ చెయ్..నీది సీఎంకు సవాల్ విసిరే స్థాయి కాదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేటీఆర్..ఎంపీగా పోటీ చెయ్..నీది సీఎంకు సవాల్ విసిరే స్థాయి కాదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు : కేటీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ లేదా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఆయన మాట్లాడారు. అధికారం పోయినా  కేటీఆర్ కు జ్ఞానోదయం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మేడిగడ్డ తప్పును సరిదిద్దుకోవాల్సిందిగా  సూచించారు.

ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ తన స్థాయి మరిచిపోయి సీఎం రేవంత్ రాజీనామా చేసి మళ్లీ పోటీకి రావాలంటూ సవాల్​ విసురుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పదవి, సీఎం పదవి ఒక్కటేనా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ మెదక్ సీటు అయినా గెలుస్తుందేమో అని అనిపించేదని

ఇప్పుడు కేటీఆర్ వైఖరితో ఆ పరిస్థితి లేదన్నారు. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఎమ్మెల్సీ   జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.