దళితబంధు విధివిధానాలేంటి..? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

దళితబంధు విధివిధానాలేంటి..? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణిలో ఉన్న పారదర్శకత మిగతా పథకాలకు ఎందుకు లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఎక్కడ మీ పారదర్శకత అని ప్రశ్నించారు. గృహలక్ష్మీ, దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారని అడిగారు. దళిత బంధు విధివిధానాలు ఏంటని ప్రశ్నించారు. 

ALSO READ :వచ్చే ఎన్నికల్లో నేను మూడోసారి గెలవడం ఖాయం: ముత్తిరెడ్డి

నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని.. ఇప్పుడెలా పథకాలు అమలు చేస్తారని ప్రశ్నించారు. దళిత బంధు పథకం ఎమ్మెల్యే బంధు పథకం అయ్యిందన్నారు. దళిత బంధు కోసం అందరూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదర్శనలు చేయాలా...? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అందరికంటే ఎక్కువగా దగాకు గురైన వారు దళితులే అని వాపోయారు.