కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ (BRS)తో తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కలిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ తో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు విషయంలో సీబీఐ (CBI) లైట్ తీసుకుంటోందని ఆరోపించారు. 

బీఎల్ సంతోష్ కి 41A కింద నోటీసులు ఇచ్చి..కవితకు మాత్రం 160 CRP కింద ఎలా నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కవితను సాక్షిగా విచారణ కోసమే తెర మీదకు తెవడంలో రహస్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.