ఢిల్లీ కోర్టులో కవిత.. జడ్జి ఎదుట హాజరు

ఢిల్లీ కోర్టులో కవిత.. జడ్జి ఎదుట హాజరు

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు. మార్చి 15వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న అధికారులు.. రాత్రి సమయంలో ఢిల్లీ తరలించారు. రాత్రంతా ఈడీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కవితను.. మార్చి 16వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో.. జస్టిస్ ఎంకే నాగ్ పాల్ బెంచ్ ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు.కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు

ఈడీ ఆఫీసులో వైద్య పరీక్షలు 

లిక్కర్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు ఇవాళ ఉదయం ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు చేశారు.  మార్చి 15 తేదీ శుక్రవాం మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత నివాసంలో మొదట ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. కవిత నివాసానికి చేరకుని కొంతసేపు సోదాలు చేసి ఆమెను విచారించింది. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. భారీ భద్రత నడుమ కవితను ఢీల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు.