
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 20న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో కవిత ఢిల్లీకి బయలలుదేరారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఆమె ఢిల్లీకి వెళ్లారు. కవిత వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. అయితే ఆమె మార్చి 20న విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈడీ విచారణకు పిలవడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో సవాల్ చేశారు కవిత. కవిత పిటిషన్ పై మార్చి 24న సుప్రీం విచారణ చేపట్టనుంది. కవిత పిటిషన్ పై ఎలాంటి ముందస్తు ఆర్డర్లు ఇవ్వకుండా కేవియట్ ఈడీ వేసింది.