ఈటలకు ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి సవాల్​

ఈటలకు ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి సవాల్​

హైదరాబాద్, వెలుగు: హుజురాబాద్​లో  ఈట‌‌ల రాజేందర్ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈట‌‌ల చేసిన అభివృద్ధిపై చ‌‌ర్చించేందుకు 5వ తేదీన హుజురాబాద్ చౌరస్తా వద్ద బ‌‌హిరంగ చ‌‌ర్చకు రావాల‌‌న్నారు. బండి సంజ‌‌య్ ఈట‌‌ల‌‌ను ఒక జోక‌‌ర్‌‌లా చూస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ త‌‌ర్వాత అంత‌‌టి మ‌‌ర్యాద ఈట‌‌ల‌‌కే ద‌‌క్కింద‌‌ని గుర్తు చేశారు.

హుజురాబాద్‌‌కు ఎస్‌‌డీఎఫ్ నిధుల కింద కేసీఆర్ రూ.100 కోట్లు ఇచ్చార‌‌ని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈట‌‌ల మ‌‌ళ్లీ హుజురాబాద్‌‌లో గెలిచి 10 నెల‌‌లైనా కేంద్రం నుంచి ఒక్క లక్ష అయినా తెచ్చి ఖ‌‌ర్చు చేశారా? అని ప్రశ్నించారు. ద‌‌మ్ముంటే కేంద్రం నుంచి రూ.100 కోట్లు తెస్తే.. తాను టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రూ.120 కోట్లు తెస్తాన‌‌న్నారు.