రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయండి

రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయండి

మూడు వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని కేంద్ర మంత్రి అమిత్ ను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు . తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ట్వీట్ చేశారు. గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, మెడికల్ కాలేజ్, నవోదయ వంటి విద్యా సంస్థలను ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్న నీతి అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని కవిత చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

రాజ్యసభకు వృద్ధుడి నామినేషన్

గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం