- అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన
- నీళ్లివ్వకుండానే నీళ్లమంత్రి అని పేరు పెట్టుకుండు
- హరీశ్ రావు మనిషని సీఎం చర్యలు తీసుకోవడం లేదా?
- ఇవన్నీ పెద్ద సారుకు తెలియకుండా హరీశ్ అడ్డుపడుతుండన్న కవిత
- కృష్ణానది కబ్జా చేసి ఫాంహౌస్ కట్టుకుండు
వనపర్తి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగులుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నానని, ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైరయ్యారు. జనం బాటలో భాగంగా ఇవాళ (నవంబర్ 24) ఆమె వనపర్తిలో మీడియాతో మాట్లాడారు.
వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఘోరాతి ఘోరంగా అరాచకాలకు పాల్పడుతున్నార ని ఆరోపించారు. చిన్న పిల్లాడిని అడిగిన ఆయన దారుణాలు చెబుతారన్నారు. ఇలాంటి వారి పట్ల జిల్లాలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టటం కష్టమని అన్నారు. బీసీ యువకులపై కేసులు పెట్టించి వారిని రక్తాలు వచ్చే ట్టు కొట్టించాడని చెప్పారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని ఆరోపించారు.
కృష్ణా నది కబ్జా చేసి ఫామ్ హౌజ్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. హరీశ్ రావు మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవటం లేదా? అని అన్నారు. నిరంజన్ రెడ్డి
అరాచకాలను కేసీఆర్ కు హరీష్ రావు తెలియనివ్వటం లేదని అన్నారు. అందుకే మీడియా ద్వారా పెద్దసార్ కు ఆయన చేసిన ఘోరాలను చెబుతున్నానని కవిత తెలిపారు.
