
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై 17న రైల్ రోకో: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఢిల్లీకి వెళ్లే ప్రతి రైలునూ ఆపేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల17న నిర్వహించే రైల్ రోకోతో ఢిల్లీకి సెగ తగిలేలా చేస్తామని తెలిపారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలో రైల్‌రోకో పోస్టర్ ఆవిష్కరణ అనంతరం, ఆమె మాట్లాడారు.
రైల్ రోకోకు బీఆర్ఎస్ నుంచి మద్దతు ఉంటుందన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు నెలల తరబడి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నా కాంగ్రెస్ అగ్రనేతలు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.