
- ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 నియామకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్చేశారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిందని మంగళవారం ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.
ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని విమర్శించారు. గ్రూప్–-1 ఉద్యోగ నియామకాల వివాదం న్యాయస్థానాల్లో తేలేవరకు అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దన్నారు.