ఎమ్మెల్సీ కవితకు షాక్..పిటిషన్ కొట్టేసిన కోర్టు

ఎమ్మెల్సీ కవితకు షాక్..పిటిషన్ కొట్టేసిన కోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు గట్టి షాక్ తగిలింది. లిక్కర్ స్కాంలో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన  కోర్టు పిటిషన్ ను కొట్టేసింది. అలాగే మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. 

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫు లాయర్ విక్రమ్ చౌదరి ఈ నెల 2024, ఏప్రిల్ 6న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సీబీఐ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన  కోర్టు పిటిషన్ ను కొట్టేసింది.