ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ నోటీసులపై తనకు తాత్కాలిక ఊరట ఇవ్వాలన్న ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కవిత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మార్చి 16న ఈడీ అధికారుల ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సింది ఉంది. ఈ సమయంలోనే విచారణకు బ్రేక్ వేయాలంటూ.. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇక లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మార్చి 11న కవితను 9గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. 16వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కవిత నిరాహార దీక్ష చేశారు. దానికి కొనసాగింపుగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.