టీఆర్ఎస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే: కవిత

టీఆర్ఎస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే: కవిత

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని తెలంగాణకు తలమానికంగా తీర్చిదిద్దారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఇప్పటివరకు టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఇక ముందు కూడా.. ఉంటారని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఆలేరులోని ఏఎన్ఆర్ గార్డెన్స్‭లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు ప్రజలు ఎంతో గౌరవం ఇస్తున్నారని అన్నారు. గొంగిడి సునీత.. జడ్పీటీసీ స్థాయి నుంచి ప్రభుత్వ చీప్ విప్‭గా ఎదగడానికి  ఆలేరు ప్రజలే ముఖ్య కారణమని కవిత చెప్పారు. 

తెలంగాణకు శ్రీరామరక్షగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలదేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రకరకాల పార్టీలు వస్తూ ఉన్నాయి కాని ఎప్పటికీ ఉండేది టీఆర్ఎస్ పార్టీనే అని ఆమె చెప్పారు. ఉద్యమ సమయంలో కూడా అనేక అంశాలతో ఉద్యమాన్ని ఆగం చేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.