
చెన్నైలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఐకానిక్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. నటుడు అర్జున్ దంపతులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ దేవాలయాన్ని నిర్మించిన హీరో అర్జున్ ను కవిత అభినందించారు. ఇంతటి విశిష్టత కలిగిన హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడు ఆనందం కలిగిస్తుందని చెప్పారు. ఓ సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొనేందుకు కవిత చెన్నైకు వెళ్లారు. బీఆర్‌ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు.