ప్రగతిభవన్కు ఎమ్మెల్సీ కవిత..కేసీఆర్తో ప్రత్యేక భేటీ

ప్రగతిభవన్కు ఎమ్మెల్సీ కవిత..కేసీఆర్తో ప్రత్యేక భేటీ

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతిభవన్ కు వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమై చర్చించనున్నారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వటంతో నేతలు, కార్యకర్తలు..ఆమె ఇంటికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో కవిత ఇంటి దగ్గర సెక్యూరిటీ పెంచారు. లిక్కర్ స్కామ్లో CRPC 160 కింద విచారణకు సహకరించాలని సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై ఐపీసీ 477 ఏ కింద కేసు నమోదు అయిందని సీబీఐ అధికారులు తెలిపారు. 

ఈ కేసు దర్యాప్తులో కవితకు సంబంధించిన కొన్ని విషయాలు బయటపడ్డాయని, తదుపరి దర్యాప్తులో సాక్ష్యాధారాలపై విచారణ జరపాల్సి ఉందని స్పష్టం చేసింది. అందుకే ఈ నెల 6న ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడ అందుబాటులో ఉంటారని నోటీసులో సీబీఐ అడిగింది. మరోవైపు తనకు నోటీసులు వచ్చాయని కవిత చెప్పారు. ఈ నెల 6న హైదరాబాద్ లో తన నివాసంలోనే అందుబాటులో ఉంటానని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత రిప్లై ఇచ్చినట్టు తెలిపారు.