మేం తెలంగాణ సేవకులం : కవిత

మేం తెలంగాణ సేవకులం :  కవిత

అధికారంలో ఉన్నా.. లేకున్నా తాము తెలంగాణ సేవలకుమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. పార్టీ కోసం పని చేసిన సోషల్​మీడియా వారియర్స్​కు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల ప్రజలకు (ధర్మపురి అర్వింద్​ను ఓడించినందుకు) ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు.