Liquor scam: ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. ఈడీ ఆఫీసులోకి కవిత

Liquor scam: ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. ఈడీ ఆఫీసులోకి కవిత

మూడో రోజు ఈడీ ఆఫీసులో (Liquor scam) విచారణకు హాజరయిన కవిత..(Kavitha) చాలా ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. చాలా యాక్టివ్ గా కనిపించారు. మార్చి 21వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని కేసీఆర్ నివాసం తుగ్లక్ రోడ్డులోని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో.. ఈడీ ఆఫీసుకు తీసుకెళుతున్న  తన ఫోన్లను చూపించారు. చూడండి.. చూడండి నా ఫోన్లు నా దగ్గరనే ఉన్నాయి.. ఫోన్లు ధ్వంసం చేయలేదు అని మీడియాకు చూపించారు. కవర్లలోని ఫోన్లు.. వాటిపై నెంబర్లను కాగితాలపై రాసి ఉన్నాయి. 

ఇక అక్కడి నుంచి 10 నిమిషాల్లోనే ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు కవిత. ఆఫీస్ ఎదుట తన లాయర్లు, భర్తతో రెండు నిమిషాలు మాట్లాడారు. అడ్వకేట్ల దగ్గర ఉన్న కాగితాలు తీసుకున్నారు. అక్కడ కూడా కవర్లలోని ఫోన్లను మరో సారి మీడియాకు చూపించారు. అక్కడ కూడా చాలా ఉత్సాహంగానే ఉన్నారు కవిత..


ఇక ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. అటెండెన్స్ కోసం కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారు. విక్టరీ సింబల్ చూపిస్తూ.. నవ్వుతూ కనిపించారు. మొదటి రెండు రోజులు కొంచెం ఆందోళనగా.. బిడియంగా కనిపించిన కవిత.. మూడో రోజు విచారణకు వెళ్లే సమయంలో మాత్రం భిన్నంగా కనిపించారు. ముఖ్యంగా ధీమా కనిపించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.