మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ఉత్తర్వులు విడుదల చేయాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ఉత్తర్వులు విడుదల చేయాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
  •     డిప్యూటీ సీఎం భట్టికి ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్ల వేతనాల కోసం తక్షణమే 010 పద్దు ఉత్తర్వులు విడుదల చేయాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పీఎంటీఏ స్టేట్ ప్రెసిడెంట్ జగదీశ్ తో పాటు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడారు. స్టేట్​ లోని 194 మోడల్ స్కూళ్లలో సుమారుగా 3వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. 

తక్కువ మంది ఉద్యోగుల కోసం ప్రత్యేక సొసైటీ ఉండటంతో రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతున్నదని చెప్పారు. అందుకే మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి, వీరికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కూడా మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు ప్రకటించారని గుర్తుచేశారు.