ఎమ్మెల్సీ పోలింగ్ ఫైనల్ పర్సెంటేజ్ రిలీజ్

ఎమ్మెల్సీ పోలింగ్ ఫైనల్ పర్సెంటేజ్ రిలీజ్
  • ఎమ్మెల్సీ ఓటింగ్‌లో జనగాం టాప్
  • ఆ తర్వాత ప్లేస్‌లో సిద్దిపేట, యాదాద్రి 
  • 15 జిల్లాల్లో 75 శాతం దాటిన ఓటింగ్
  • 60.77 శాతంతో హైదరాబాద్ లాస్ట్
  • వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో 76.41 శాతం
  • హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో 67.26% పోలింగ్

హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ గతంలో కంటే భారీగా పెరిగింది. ఆదివారం జరిగిన పోలింగ్లో 15 జిల్లాల్లో 75 శాతానికి పైగా నమోదైంది. ఇందులో ఆరు జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. జనగాం జిల్లాలో అత్యధికంగా 83.33 శాతం ఓట్లు పడ్డాయి. ఇక్కడ 21,213 మంది ఓటర్లు ఉంటే 17,677 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత సిద్దిపేట, యదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. మొత్తంగా  నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానానికి అత్యధికంగా 76.41 శాతం పోలింగ్ నమోదు కాగా మూడు లక్షల 86 వేల 320 ఓట్లు పోలయ్యాయి. 
 

ఎమ్మెల్సీ ఓటింగ్లో జనగాం టాప్
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానానికి 67.26 శాతం నమోదు కాగా 3లక్షల 57వేల 354 ఓట్లు పోలైనట్లు సీఈవో శశాంక్ గోయల్ సోమవారం తెలిపారు. వరంగల్ స్థానం టీఆర్ఎస్ సిట్టింగ్ కావడం, అక్కడ కొన్ని నెలల ముందు నుంచే ఒకరిద్దరు క్యాండిడేట్లు ప్రచారం స్టార్ట్ చేయడం, పోటీదారులు ఎక్కువ మంది ఉండటం పోలింగ్ శాతం పెరిగేందుకు కలిసొచ్చిదంటున్నారు. 

 

వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి జిల్లాల వారీగా పోలైన ఓట్లు
జిల్లా    పోలింగ్ శాతం
సిద్దిపేట    82.28
జనగాం    83.33
వరంగల్ అర్బన్    72.99
వరంగల్ రూరల్    77.87
మహబూబాబాద్    78.03
ములుగు    79.41
భూపాలపల్లి    69.46
భద్రాద్రి కొత్తగూడెం    73.55
ఖమ్మం    74.52
యదాద్రి భువనగిరి    81.21
సూర్యాపేట    76.12
నల్గొండ    77.85
మొత్తం    76.41
హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్
జిల్లా    పోలింగ్శాతం
మహబూబ్నగర్    75.97
నాగర్కర్నూల్    76.27
వనపర్తి    80.33
జోగులాంబ గద్వాల    80.81
నారాయణపేట    79.29
రంగారెడ్డి    65.25
వికారాబాద్    80.55
మేడ్చల్మల్కాజ్గిరి    62.71
హైదరాబాద్    60.77
మొత్తం    67.26