ఆ దుష్టశక్తులను అడ్డుకోవాలి: విజయశాంతి

ఆ దుష్టశక్తులను అడ్డుకోవాలి: విజయశాంతి

జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండలోని పోచమ్మ ఆలయాన్ని ఎమ్మెల్సీ విజయశాంతి ఆదివారం సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుష్టశక్తులు చొరబడే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర సంపదను దోచుకునేందుకు పన్నాగం పన్నుతున్నాయన్నారు. 

తెలంగాణ వచ్చిందని తాఫీగా ఉండొద్దని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ లేటుగా వచ్చినా  లేటేస్టుగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుందన్నారు.