మృతుల కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ

తాండూరు, వెలుగు : పిడుగుపాటుతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిడుగుపాటుతో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

స్థానిక ఆర్డీఓ శ్రీనివాసరావుకు ఆయన ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  తక్షణ సాయం కింద బాధిత కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందించారు.