
హైటెక్ సిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హఫిజ్ పేట్ నుంచి హైటెక్ సిటీ రైల్వే మార్గంలో రైలు పట్టాలు దాటుతుండగా..ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు వలస కులిలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజప్ప, కృష్ణ, శ్రీనులుగా గుర్తించారు. వీరంతా సంకల్ప్అపార్ట్మెంట్సమీపంలో నివసిస్తున్నారని తెలుస్తోంది. వీరు వనపర్తికి చెందిన వారిగా నిర్ధారించారు. వీరిలో ఒకరి వద్ద మద్యం సీసా దొరికినట్టుగా పోలీసులు తెలిపారు.