
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం తమిళనాడులో రెండో దశ పోలింగ్ జరుతుంది. ఈ సందర్భంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తన కూతురు శృతి హాసన్‌తో కలిసి ఈరోజు ఆల్వార్ పేట కార్పోరేషన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. సాధారణ ప్రజలతో పాటుగా క్యూలైన్ లో నించుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని 38 లోక్‌సభ సీట్లతోపాటు 18 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.