ఐపీఓకు దరఖాస్తు చేసిన మొబిక్విక్

ఐపీఓకు దరఖాస్తు చేసిన మొబిక్విక్

న్యూఢిల్లీ :  యునికార్న్ ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్   ఐపీఓ కోసం సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది.   తాజా షేర్ల జారీ ద్వారా రూ. 700 కోట్లను సంపాదించాలని చూస్తోంది. కంపెనీ రూ. 140 కోట్ల వరకు విలువైన  సెక్యూరిటీల ప్రీ-ఐపిఓ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను చేపట్టవచ్చు.   తాజా ఇష్యూ నుంచి వచ్చిన దాంట్లో రూ. 250 కోట్ల వరకు ఆర్థిక సేవల వ్యాపారంలో నిధుల వృద్ధికి,  రూ. 135 కోట్లను పేమెంట్​ సేవల వ్యాపారం కోసం ఉపయోగిస్తారు. 

డేటా, మెషిన్ లెర్నింగ్,  ఏఐ ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడి కోసం రూ.135 కోట్లు కేటాయిస్తారు. చెల్లింపు పరికరాల వ్యాపారం,  సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు రూ.70.28 కోట్లను కేటాయిస్తారు.  డిజిటల్ క్రెడిట్, పెట్టుబడులు,  బీమాలో వివిధ చెల్లింపు ఎంపికలు,  ఆర్థిక ఉత్పత్తులను మొబిక్విక్​అమ్ముతుంది. వ్యాపారులకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ చెక్‌‌‌‌‌‌‌‌అవుట్, క్విక్ క్యూఆర్ స్కాన్  పే వంటి సేవలను అందిస్తుంది.