చిన్న సిటీల్లోనూ మొబీక్విక్​ బీఎన్​పీఎల్​ లోన్లు

చిన్న సిటీల్లోనూ మొబీక్విక్​ బీఎన్​పీఎల్​ లోన్లు

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్​ పేమెంట్ల స్టార్టప్​ మొబీక్విక్​‘బై నౌ, పే లేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ (బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లోన్లపై మరింత  ఫోకస్​ చేస్తున్నట్టు ప్రకటించింది. 2026 వరకు మనదేశంలోని ఈ మార్కెట్​ విలువ  45–50 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్ల చేరే అవకాశాలు ఉన్నందున, భారీ అవకాశాలను దక్కించుకుంటామని తెలిపింది. ఇక నుంచి టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, 2  టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 నగరాలు, పట్టణాల్లోనూ భారీగా లోన్లు ఇస్తామని తెలిపింది. ఇందుకోసం 2019లోనే మొబిక్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం దీనికి 2.4 కోట్ల మంది ప్రీ అప్రూవ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  యూజర్లు ఉన్నారు. ఇప్పటికే బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జీఎంవీ 22 రెట్లు పెరిగింది.  జిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 80 శాతం రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. మొబిక్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా యూజర్లు రూ.500 నుంచి రూ.30 వేల  వరకు లోన్​ తీసుకోచ్చు. వీటిపై 15 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఈ గడువు మించితే లేటు ఫీజు వసూలు చేస్తారు. అయితే యూజర్లు ఒకసారి యాక్టివేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జిప్​ ఈఎంఐ కస్టమర్లలో ఎక్కువ మంది రూ.25 వేలు–రూ.లక్ష విలువ కలిగిన వస్తువుల కొనుగొలుకు ఆసక్తి చూపిస్తున్నారు. లోన్లను 3/6 నెలల్లోపు వాయిదాలలో చెల్లిస్తున్నారు. బీఎన్​పీఎల్​ లోన్ల కోసం 10 కు పైగా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నామని మొబీక్విక్​ తెలిపింది.