ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ముఖ్యమైన ప్రకటన

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ముఖ్యమైన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా శుక్రవారం సభలో కీలక ప్రకటన చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సభలోకి సభ్యులు ఇకపై సెల్ ఫోన్లు తీసుకు రావొద్దని సూచించారు.  ఈ నెల 19న అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు వివాదంపై టీడీపీ నేతలు వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో సభలో సెల్ ఫోన్లతో వీడియో తీయడంపై వివాదం చెలరేగింది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని ముఖ్యమైన ప్రకటన అంటూ సభలో సెల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. 

వాస్తవానికి పార్లమెంట్, అసెంబ్లీ వంటి సమావేశాలు జరుగుతున్నప్పుడు... సభలో ఏమైనా అనుకోని ఘటనలు... అనుచిత వ్యాఖ్యలు చేయడం, గొడవలు వంటి జరిగినప్పుడు ఆ ఫుటేజ్ ను అక్కడ ఉన్న సిబ్బంది బయట పడకుండా జాగ్రత్త పడతారు. ఒక వైళ ఆ సమయంలో లైవ్ నడుస్తుంటే.. వెంటనే... లైవ్ ను కూడా నిలిపివేస్తారు. అయితే ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు లైవ్ లోకి వెళ్లకుండా స్పీకర్ మైక్ కట్ చేస్తే.. అక్కడ ఉన్న టీడీపీ నేతలు మాత్రం.. చంద్రబాబు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో కాస్త తెగ వైరల్ అయ్యింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు.. ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటన చేశారు.