బిగ్ బాస్లో మొబైల్ ఫోన్స్.. ఇకనుండి కొత్త రూల్స్, కొత్త గేమ్స్

బిగ్ బాస్లో మొబైల్ ఫోన్స్.. ఇకనుండి కొత్త రూల్స్, కొత్త గేమ్స్

బిగ్ బాస్(Bigg boss).. ఈ వినూత్న షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఒక హౌస్ లో ఉంచి.. వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి, టాస్కుల పేరుతో వాళ్ళల్లో వాళ్లకె గొడవలు పెట్టిస్తూ ముందుకు సాగడం ఈ షో స్పెషాలిటీ. ఇక్కడ మరో వీశేషం ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ లో గడియారాలకు,  మొబైల్ ఫోన్స్ నాట్ అలోడ్. ఈ రెండు ఎలిమెంట్స్(గడియారం, మొబైల్ ఫోన్స్) ఈ షోకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

అయితే ఈ రూల్ ను తొలిసారిగా బ్రేక్ చేయనున్నాడట బిగ్ బాస్. త్వరలో హిందీ బిగ్ బాస్ సీజన్ 17 మొదలుకానుంది. అక్టోబర్ 15 నుండి ఈ కొత్త సీజన్ మొదలు కానుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న షోకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. 

అయితే తాజా సమాచారం మేరకు.. హిందీ బిగ్ బాస్ సీజన్ 17 కోసం ఒక కొత్త ఎలిమెంట్ ను యాడ్ చేయనున్నారట మేకర్స్. అదేంటంటే.. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కు మొబైల్ ఫోన్ యూజ్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నారట. బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సీజన్ లో ఈ ఎలిమెంట్ లేదు. మొదటిసారి హిందీ బిగ్ బాస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. అయితే ఇక్కడే అసలు ట్విస్టు పెట్టారు మేకర్స్. ఈ ఫోన్ వాడకం అనే కొత్త ఎలిమెంట్ అన్ని సమయాల్లో ఉండదట. ఇందుకోసం కంటెస్టెంట్స్ ప్రత్యేకమైన టాస్కులు ఆడి గెలవాల్సి ఉంటుంది. కేవలం గెలిచిన వారికి మాత్రమే, అది కూడా లిమిటెడ్ టైం వరకు ఫోన్ వాడుకొనే అవకాశం ఉండనుంది. ఈ కొత్త ఎలిమెంట్ తో షోకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు మేకర్స్.