తిరుమల క్యూ కాంప్లెక్స్లో మొబైల్ కలకలం.. కంపార్ట్మెంట్లలో వీడియోలు తీసిన భక్తుడు

తిరుమల క్యూ కాంప్లెక్స్లో మొబైల్ కలకలం.. కంపార్ట్మెంట్లలో వీడియోలు తీసిన భక్తుడు

తిరుమల: తిరుమలలో మరోసారి భద్రత వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్లిన కొందరు భక్తులు మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కంపార్ట్మెంట్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది.

తనిఖీల్లో టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వహించినట్లు తేలింది. నిషేధిత ప్రాంతంలో భక్తులు సెల్ ఫోన్లు ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

తనిఖీలు దాటుకుని సెల్ ఫోన్ ఎలా వెళ్ళిందన్న దానిపై ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న టీటీడీకి ఈ ఘటన సవాల్ విసిరింది. స్కానర్ల డొల్లతనం బయటపడింది. సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.