హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్నియంత్రణకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్మెట్రోపాలిటన్ ఏరియాలో సమగ్ర మొబిలిటీ ప్లాన్–2050 ను తయారు చేస్తోంది. దీనికి సంబంధించి ముసాయిదా ప్లాన్‌ను హెచ్ఎండీఏ కమిషనర్సర్పరాజ్అహ్మద్మంగళవారం విడుదల చేశారు. ఈ ప్లాన్ హెచ్ఎండీఏ సిద్ధం చేస్తున్న మాస్టర్‌ప్లాన్–2050లో అంతర్భాగంగా ఉంటుందని అధికారులు తెలిపారు. సమగ్ర మొబిలిటీ ప్లాన్రూపకల్పన పనులకు లీ అసోసియేట్స్సౌత్ఏషియా ప్రైవేట్లిమిటెడ్ ను కన్సల్టెన్సీగా నియమించారు.
