ఖమ్మంలో మాజీ ఆర్మీ ఉద్యోగుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్

ఖమ్మంలో మాజీ ఆర్మీ ఉద్యోగుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్

 ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు : భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో  ఖమ్మం నగరంలోని ఓల్డ్ ఎన్ ఎస్పీ క్యాంప్ లోని పార్క్ లో శుక్రవారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాక్ చేసే దాడిని ఎలా తిప్పికొట్టాలి, వార్ లో సైనికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శత్రువులను ఎదుర్కోవడం లాంటి వాటిపై అవగాహన కల్పించారు. వార్ లో గాయపడిన సైనికులను ఎలా కాపాడాలి, పాక్ యుద్ధ తీవ్రత నుంచి ‘మనల్ని మనం’ ఎలా రక్షించుకోవాలనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ లో స్కౌట్, ఎన్ సీసీ, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.