మరో శుభవార్త : హ్యూమన్ ట్రయల్స్ లో 94.5శాతం పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్

మరో శుభవార్త : హ్యూమన్ ట్రయల్స్ లో 94.5శాతం పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ పై నిర్వహిస్తున్న పరిశోధనల్లో పాజిటీవ్ రిజల్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది.  ఫైజర్ వ్యాక్సిన్ ప్రకటన మరువక ముందే తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా మరో శుభవార్త తెలిపింది. హ్యూమన్ ట్రయల్స్ లో కరోనా వ్యాక్సిన్  94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని  మోడెర్నా కంపెనీ ప్రకటించింది.

మరోవైపు  దాదాపుగా అన్ని వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశలో ఉండగా..కొన్ని వ్యాక్సిన్ లు ఏడాది చివరికి అందుబాటులో రానున్నాయి. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో రానుందని ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అమెరికన్ కంపెనీ ఫైజర్ అభివృద్ధి చేసిన మరో వ్యాక్సిన్ కూడా డిసెంబర్ నాటికి మార్కెట్లో రానుందని తెలుస్తోంది.