
అంఫన్ తుఫాన్ వల్ల పశ్చిమ బెంగాల్ అతలాకుతలమైంది. బెంగాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ప్రధాని మోడీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించి పరిశీలించారు. తుఫాన్ వల్ల బెంగాల్లో 80 మంది చనిపోవడం బాధాకరమని మోడీ అన్నారు. తుఫాన్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు మోడీ తెలిపారు. తుఫాన్ ధాటికి బెంగాల్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. బెంగాల్‌కు వెయ్యి కోట్ల ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు మోడీ ప్రకటించారు. తుఫాన్ నష్టాన్ని సీఎం మమతా బెనర్జీ వివరించారని ఆయన అన్నారు. కరోనా కంటే అంఫన్ తుఫానే భయంకరంగా ఉందని సీఎం మమతా అన్నారని మోడీ తెలిపారు. తుఫాన్ ప్రభావం నుంచి బెంగాల్ త్వరలోనే కోలుకుంటుందని ఆయన తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో త్వరోలోనే కేంద్ర బృందం పర్యటిస్తుందని ఆయన అన్నారు. బెంగాల్‌కు కేంద్రం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
For More News..