ఇందిరాగాంధీ దయతో మోదీ ప్రధానమంత్రి అయ్యారు : జీవన్ రెడ్డి

ఇందిరాగాంధీ దయతో మోదీ ప్రధానమంత్రి అయ్యారు : జీవన్ రెడ్డి

ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఇందిరాగాంధీ దయతో మోదీ ప్రధానమంత్రి అయ్యారని విమర్శించారు. పాకిస్తాన్ చైనాల మెడలు వంచిన ఇందిరా గాంధీ.. సర్జికల్ స్ట్రైక్ చేసి తీవ్రవాదులను మట్టికలిపారని తెలిపారు. మోడీ మాత్రం పిలువని పేరంటానికి వెళ్లి నవాజ్ షరీఫ్ వద్ద ఖీర్ కురుమ తినివచ్చారని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీని అపర దుర్గాదేవిగా పోల్చిన  వాజ్ పాయ్ లాంటి లౌకికవాదులుగా ఉండాలని.. స్వార్థ రాజకీయాల కోసం కాదని చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక వాదానికి, జాతీయవాదానికి కట్టుబడి ఉందన్నారు జీవన్ రెడ్డి. మోడీకి పసుపు బోర్డు ఇవ్వడం ఇష్టం లేదని అందుకే జీవోలో ఎక్కడ బోర్డు ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత లేదని ఆరోపించారు. ఎన్నికల కోసం అరవింద్ ఒక బాండు రాస్తే.. మోడీ ఒక బాండు ఇచ్చాడని విమర్శించారు. ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించని అరవింద్ ఇప్పుడు సహకరిస్తే నెల రోజుల్లో తెరిపిస్తాను అనడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు.