రండి.. సర్ధార్ ను చూద్దాం: మోడీ బర్త్ డే విజిట్

రండి.. సర్ధార్ ను చూద్దాం: మోడీ బర్త్ డే విజిట్

modi birthdayప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 69వ పుట్టిన రోజున గుజరాత్ లోని నర్మదా తీరం విజిట్ కు వెళ్లారు. ఈ రోజు ఉదయం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని సందర్శించారు. నర్మదా నదీ ఒడ్డున ఐక్యతా చిహ్నం పేరుతో ఏర్పాటు చేసిన పటేల్ విగ్రహం నలువైపులా వీడియో తీసి మోడీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రండి.. మహోన్నత సర్దార్ పటేల్ ను సందర్శిద్దాం అంటూ ట్వీట్ చేశారాయన.

ఆ తర్వాత సర్దార్ సరోవర్ డ్యామ్ వద్దకు వెళ్లి నర్మదా నదికి పూజలు చేశారు మోడీ. అలాగే కెవాడియాలోని ఎకో టూరిజం ప్రాజెక్టులను సందర్శించారు. సీతాకోక చిలుకల పార్కుకు వెళ్లి, అక్కడ వాటిని పెంచే బుట్టలో నుంచి బయటకు వదిలారు. పర్యావరణ హిత ప్లేట్ల తయారీ కేంద్రంలోకి వెళ్లి, ఆ యంత్రాలను ఆపరేట్ చేశారు. ప్లేట్ల తయారీని పరిశీలించారు.

నర్మదా జిల్లాలోని గురుదేశ్వర్ దత్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. మధ్యాహ్నం తన ఇంటికి వెళ్లి తల్లి హీరాబెన్ వద్దకు వెళ్లి ప్రధాని మోడీ ఆమె దీవెనలు తీసుకుంటారు.