టెర్రరిజం అందరికీ శత్రువే.. అంతం చేద్దాం రండి: మోడీ

టెర్రరిజం అందరికీ శత్రువే.. అంతం చేద్దాం రండి: మోడీ

టెర్రరిజం అందరికీ శత్రువే
అంతం చేద్దాం రండి… జీ20 ప్రతినిధులతో ప్రధాని మోడీ
ప్రపంచంలోని అన్ని దేశాలకూ టెర్రరిజం ఉమ్మడి శత్రువని, దీనిపై కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల ముందున్న మూడు మేజర్చాలెంజ్లు.. అనిశ్చితి, క్షీణత, గ్లోబల్ఎకానమీ మందగమనం అని, వాటిపై ఫోకస్ పెట్టాలన్నారు. జపాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన జీ 20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా, జపాన్, రష్యా, సౌదీ దేశాల అధినేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. అమాయకుల ప్రాణాలను టెర్రరిజం బలి తీసుకుంటున్నదని, ఆర్థికాభివృద్ధిని, సోషల్స్టెబిలిటీనీ దెబ్బతీస్తున్నదని వారితో అన్నారు. టెర్రరిజంపై పోరాటంలో ఇండియాకు మద్దతుగా నిలవాలని మోడీ కోరారు.

మానవాళి మనుగడకు అతిపెద్ద ముప్పు టెర్రరిజమేనని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. టెర్రరిజం అమాయకుల ప్రాణాలను తీయడంతో పాటు ఆర్థికాభివృద్ధిని, సోషల్​స్టెబిలిటీనీ దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలకూ టెర్రరిజం ఉమ్మడి శత్రువని, దీనిపై కలిసికట్టుగా పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల ముందున్న మూడు మేజర్​చాలెంజ్​లు.. అనిశ్చితి, క్షీణత, గ్లోబల్​ఎకానమీలను మోడీ ప్రస్తావించారు. ఈ మూడింటిపైనా ఫోకస్​చేయాల్సిన అవసరం ఉందన్నారు. వనరుల కొరత వల్ల నిర్మాణ రంగంలో పెట్టుబడుల లోటు దాదాపు 1.3 ట్రిలియన్​అమెరికన్​డాలర్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారని ఫారెన్​సెక్రెటరీ విజయ్​గోఖలే చెప్పారు. బ్రిక్స్​దేశాధినేతలతో జరిగిన సమావేశాల్లో వివిధ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై మోడీ చర్చించారన్నారు.

బ్రెజిల్​కొత్త ప్రెసిడెంట్​జైర్​బోల్సనారోను అభినందించిన మోడీ ఆయనను బ్రిక్స్​ఫ్యామిలీలోకి ఆహ్వానించారన్నారు. ఏ దేశానికి ఆ దేశం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోడీ చెప్పారు. ట్రేడ్​వార్​కు ముగింపు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. వరల్డ్​ట్రేడ్​ఆర్గనైజేషన్​(డబ్ల్యూటీవో)ను కాపాడాలని కోరారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడుల కొరత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇది వనరులలేమిని చూపిస్తోందని, సామాజిక అస్థిరతకూ దారితీయవచ్చని హెచ్చరించారు.

జపాన్​ వేదికగా జరుగుతున్న జీ 20 దేశాల సదస్సులో భాగంగా తొలిరోజు శుక్రవారం అమెరికా, జపాన్, రష్యా, సౌదీ దేశాల అధినేతలతో మోడీ విడివిడిగా భేటీ అయ్యారు. టెర్రరిజంపై పోరాటంలో ఇండియాకు మద్దతుగా నిలవాలని వారిని కోరారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం కీలకమైందన్నారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ, వాతావరణం రూపంలో మనతో పాటు భావితరాలకూ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. టెర్రరిస్టులకు సాయం అందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

బహువిధ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి

ఇంటర్నేషనల్​ఫైనాన్సియల్, బిజినెస్​ఇనిస్టిట్యూషన్స్, సంస్థల్లో బహువిధ నాయకత్వాన్ని, నిర్ణయాలను ప్రోత్సహించాలని మోడీ కోరారు. జపాన్, అమెరికా దేశాధినేతలతో జరిగిన చర్చల్లో ఇండియా పసిఫిక్​ప్రాంతంలో కనెక్టివిటి, మౌలిక వసతులు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోడీ చెప్పారు. ఇండియాతో మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నట్లు ట్రంప్​చెప్పారన్నారు. ఇక ట్రంప్​తో జరిగిన భేటీలో రెండు దేశాల మధ్య రక్షణ, సహకారం తదితర కీలక అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎస్​400 మిస్సైల్స్​ప్రస్తావన రాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్​గోఖలే చెప్పారు. ఈ సందర్భంగా చైనా, అమెరికా, రష్యా, జపాన్ దేశాధినేతలకు ప్రధాని మోడీ ట్విట్టర్​ ద్వారా ధన్యవాదాలు చెప్పారు.

మోడీ, షింజోల విజయం అద్భుతం: ట్రంప్

అద్భుత విజయం సాధించిన నరేంద్ర మోడీ, షింజో అబెలను అభినందించాల్సిందేనని అమెరికా ప్రెసిడెంట్​డొనాల్డ్​ట్రంప్​కొనియాడారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సమృద్ధి, స్థిరత్వాలే లక్ష్యంగా దేశాల భాగస్వామ్యం విజయవంతం కావాలని ట్రంప్  ఆకాక్షించారు.