ఐదేళ్లలో మోడీ ఫారిన్ టూర్లకు 443.4 కోట్లు

ఐదేళ్లలో మోడీ ఫారిన్ టూర్లకు 443.4 కోట్లు

మన్మోహన్ సింగ్ కంటే రూ. 50 కోట్లు తక్కువే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదేళ్ల విదేశీ పర్యటనలకు సంబంధించి నరూ.443.4 కోట్ల బిల్లులను ఎయిర్ఇండియా పీఎంఓ కార్యాలయానికి పంపింది. మరో ఐదు విదేశీ పర్యటనల బిల్లులు పంపాల్సి ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు మోడీ44 విదేశీ పర్యటనలకు వెళ్లారు. గతంలో ఏ ప్రధాని ఇన్నిసార్లు ఫారిన్ టూర్లు చేపట్టలేదు. ఈ నెలలో చివరిసారి ప్రధానిహోదాలో యూఏఈ వెళ్లనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు యూఏఈ ఇవ్వనున్న అత్యున్నత పౌరసత్కారం అందుకునేందుకు వెళ్లనున్నారు. మోడీ దగ్గరి దేశాలకు ఖరీదైన ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన బిజినెస్ జెట్ తో పాటు బోయింగ్737 బిజినెస్ జెట్ ఉపయోగించారు.దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ విదేశీపర్యటనల కంటే ఖర్చు 50 కోట్లు తగ్గింది.న్యూక్లియర్ పవర్ గా ఎదిగిన ఇండియా అంతర్జాతీయ సంబంధాలపై దృష్టి పెట్టిందని బీజేపీ ఈ పర్యటనలను సమర్థించుకోగా,అవసరానికి మంచి విదేశాలకు వెళ్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.